లోకువల లోకం!!!
లోకువల లోకం!!!
లోకంలో “లోకువకు” కొదవలేదు!!!
దొంగ స్వామీజీకి- అమాయక భక్తులు లోకువ!
రాజకీయ నాయకుడికి- ఓటరు లోకువ!
ఇంటర్వ్యూ అధికారికి- నిరుద్యోగి లోకువ!
పూజారికి- అమాయక భక్తుడు లోకువ!
ప్రతీ ఛానల్ వాడికి -ప్రేక్షకులు లోకువ!
సినిమావాడికి- ప్రేక్షక అభిమానులు లోకువ!
ఎదిగిన పిల్లలకి -తల్లిదండ్రులు లోకువ!
ప్రజలు -మోసవ్యాపారికి లోకువ!
రైతు- దళారికి లోకువ!
మేక- తలారికి లోకువ!
ప్రభుత్వానికి- ప్రజలు లోకువ!
డాక్టర్ కి- పేషంట్ లోకువ!
ప్లీడర్ కి- గుమాస్తా,క్లయింట్ లోకువ!
మాల్స్ వాళ్లకి- యువత లోకువ!
లాప్ టాప్ కి -ఐ.టీ వాడు లోకువ!
మెక్ డోనాల్డ్ కి -కుర్ర కారంటే లోకువ! చదువుకున్నవాడికి- చదవనివాడు లోకువ! పేదవాడంటే- కరెన్సీకి లోకువ!
బస్సువాడికి- కారు లోకువ!
కారువాడికి- స్కూటర్ లోకువ!
స్కూటర్ వాడికి- సైకిల్ లోకువ!
అందరికీ- పాదచారి లోకువ!
డబ్బుకు- జనం లోకువ!
ఆజ్ఞానిని చూస్తే- విజ్ఞానికి లోకువ!
నోరు- మన చెయ్యికి లోకువ!
దొంగకి- తాళాలు లోకువ!
చెయ్యికి- వేలు లోకువ!
స్మార్ట్ ఫోన్ కి- మన వేలు లోకువ!
చెప్పేవాడికి- వినేవాడు లోకువ!
రాసేవాడికి- చదివేవాడు లోకువ!
వాట్సాప్ వాడికి, పంపేవాడికి- మన అందరి ఇన్ బాక్సులు లోకువ!
ఇదంతా ఒక ఎత్తు!!!
నా వేలు దురద- నా ఈ రాతకి లోకువ!
ప్రతీవాడికీ అవతల వాడు లోకువ
మీరూ పంపండి వేరే ఇన్ బాక్సులకి-
అవన్నీ మీకూ లోకువే!
ఇదంతా రాసింది సామాజిక స్పృహ మరియూ మెలకువ తోనే, మీమీద "లోకువ"తో కాదు- "మక్కువ" తోనే సుమా!